![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 ఫస్ట్ వీక్ ముగిసింది. హౌస్ లో పదిహేను కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఒకరు ఎలిమినేషన్ అవుతారనేది అందరికి తెలిసిందే. అయితే ఎవరు ఎలిమినేషన్ అయ్యారనేది తెలుసుకోవాలనే ఆసక్తి బిబి ఆడియన్స్ అందరిలోను ఉంది. (Shrasti Verma Elimination)
అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో ఫ్లోరా సైనీ, డీమాన్ పవన్, శ్రష్టి వర్మ ముగ్గురు తక్కువ ఓట్ల తేడాతో లీస్ట్ లో ఉన్నారు. ఓటింగ్ టాప్ లో తనూజ ఉండగా సెకెండ్ ప్లేస్ లో సుమన్ శెట్టి, థర్డ్ ప్లేస్ లో ఇమ్మాన్యుయల్ ఉన్నారు. హౌస్ లో డీమాన్ పవన్ కాస్త బాగానే కన్పిస్తున్నాడు. కానీ ఫ్లోరా సైని, శ్రష్టి వర్మ స్క్రీన్ స్పేస్ తక్కువే ఉంది. అందులోను వీరికి పెద్దగా ఫ్యాన్స్ ఎవరు లేరు. ఫ్లోరా సైనికి తెలుగు అభిమానులు అంతగా కనెక్ట్ అయ్యారో లేదో తెలియదు. అలాగే శ్రష్టి వర్మకి నెగెటివ్ ఎక్కువగా ఉంది. మరి ఈ ముగ్గురిలో ఎవరు హౌస్ నుండి బయటకు వస్తారనే క్యూరియాసిటీ అందరిలోను ఉంది.
ప్రతీ సీజన్ వీకెండ్ శని, ఆదివారాలు ప్రసారం కాబోయే ఎపిసోడ్స్ రెండూ కూడా శనివారం షూట్ పూర్తవుతాయి. అయితే హౌస్ లో ఏం జరిగింది.. శనివారం ఎవరిని నాగార్జున తిట్టాడు.. ఎవరికి రెడ్ కార్డ్ ఇచ్చాడు.. ఇలా కొన్ని లీక్స్ బయటకు వస్తుంటాయి. అయితే దీనితో పాటు ఎవరు ఎలిమినేషన్ అయ్యారనేది కూడా లీక్ అవుతుంది. నిన్న సాయంత్రం నుండి ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసినా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ(Shrasti Verma) ఎలిమినేట్ అయ్యిందని వార్తలొస్తున్నాయి. బిగ్ బాస్ అప్డేట్స్, ట్రోల్స్ అంటు చాలా సోషల్ మీడియా అకౌంట్స్ లో శ్రష్టి వర్మ ఎలిమినేషన్ అయ్యిందనే చెప్తున్నారు. గత సీజన్ కూడా ఇలానే లీక్స్ వచ్చాయి. అయితే కొన్నిసార్లు బిగ్ బాస్ టీమ్ కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంటుంది.
![]() |
![]() |